తవణంపల్లి ఏప్రిల్ 22 మన ద్యాస

తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ కోఆర్డినేటర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బడి పిలుస్తుంది అనే కార్యక్రమానికి జిల్లా నుండి విచ్చేసిన జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ కోఆర్డినేటర్ పాల్గొనడం జరిగింది. అనంతరం విద్యార్థులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం కోఆర్డినేటర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదును పెంచాలని, ప్రభుత్వ బడులలో చేర్పించడం వల్ల విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. అలాగే ఎన్రోల్మెంట్ డ్రైవ్ డ్రాప్ అవుట్,పిల్లల వివరాలను మండలంలోని సిఆర్పి లను అడిగి తెలుసుకున్నారు. మరియు సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు పలు సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎల్.ఎస్ ఓ కోఆర్డినేటర్ శశిధర్, మండల విద్యాశాఖ అధికారి హేమలత, మోహన్ రెడ్డి, మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు సి ఆర్ ఎం టి లు, ఎం ఆర్ సి సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *