మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్‌ 18 :నెల్లూరు అంటేనే ఒక వైభవం.. ఆ వైభవానికి మకుటంలా మన నగరంలో వెలిసింది ఈ అయోధ్య రామ మందిరం అని వేమి రెడ్డి పట్టా భి రామి రెడ్డి అన్నారు. నెల్లూరు నగరం, ఎన్ టి ఆర్ నగర్, మిని బైపాస్ దగ్గర నమూనా రామ మందిరాన్ని నిర్మించినారు.నెల్లూరు సిటీ హిస్టరీలోనే ఎవరూ సాహసించని విధంగా, అత్యంత భారీ వ్యయంతో ఈ మెగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు .ఇది కేవలం ప్రదర్శన కాదు, నెల్లూరు గర్వించదగ్గ ఒక అద్భుతం అని అన్నారు. .సిటీ ప్రజలు ఇప్పటివరకు ఇలాంటి భారీ సెట్టింగ్‌ను కేవలం సినిమాల్లోనో లేదా మెట్రో సిటీల్లోనో చూశారు, కానీ మొదటిసారి మన నెల్లూరు గడ్డపై దీనిని ఆవిష్కరించారు అని అన్నారు.అచ్చం అయోధ్యలోని రామ మందిరం ఎలా ఉంటుందో, అదే అనుభూతిని ఇవ్వడానికి 100 మంది ప్రసిద్ధ కళాకారులు సుమారు 2 నెలల పాటు పగలు రేయి శ్రమించి ఈ భారీ మందిర నమూనాను నిర్మించారు అని తెలిపారు.ప్రతి పిల్లర్, ప్రతి గోపురం అయోధ్య అసలు ఆలయాన్ని ప్రతిబింబించేలా కోట్లాది రూపాయల వ్యయంతో ఈ సెట్టింగ్ వేశారు అని అన్నారు.అయోధ్య రామ మందిర దర్శనాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు,ఆ రామయ్యను కళ్లారా చూసుకునే భాగ్యాన్ని నెల్లూరు వాసులకు కల్పిస్తున్నారు అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్ డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్ 14వ డివిజన్ కార్పొరేటర్ కర్త ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు రంగనాయకుల దేవస్థానం చైర్మన్ లెక్కల ఎంక రెడ్డి పాల్గొన్నారు.

v

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *