తిరుపతి, మన ధ్యాస,;- సమాజ సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న “వే ఫౌండేషన్” వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్యకు అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది. వరల్డ్ ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారు ఆయనకు ప్రతిష్టాత్మకమైన సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పురస్కారాన్ని అందజేశారు. డా. అంకయ్య సమాజ సేవలో చూపిన అసాధారణ ప్రతిభ, అంకితభావం, నిబద్ధత, ప్రభావవంతమైన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ డా. పైడి అంకయ్య సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు డా. పైడి అంకయ్య గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *