కలిగిరి ఏప్రిల్ 05, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె

కలిగిరి ప్రాథమికఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి గా భాధ్యతలు చేపట్టి , తనదైన శైలిలో పి హెచ్ సి నీ జిల్లాలో మందుంజలో ఉంచి ,ముచ్చటగా మూడు సార్లు ఉత్తమ వైద్యురాలి గా జిల్లా అధికారుల నుండి ప్రశంసా పత్రాలు అందుకొని , తన చిరు నవ్వుతో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వైద్య సేవలు అందించి న బిజ్జం గీతారెడ్డికి కలిగిరి మండల టిడిపి అధ్యక్షులు పూసాల వెంగపనాయుడు అభినందనలు తెలిపారు. పి.జి గైనకాలజీ సీటు తిరుపతి ఎస్.వి మెడికల్ కాలేజీ నందు పొంది, ఉన్నత చదువుల కోసమై వెళ్ళుచున్న డాక్టర్ బిజ్జo గీతారెడ్డి నీ ఆదివారం కలిగిరి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి నీ ఘనంగా సత్కరించడం జరిగింది, అనంతరం ఆయన మాట్లాడుతూ గీతా రెడ్డి కలిగిరి పిహెచ్ సి కి అందించిన వైద్య సేవల ను కొనియాడుతూ గీతా రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ గీతా రెడ్డి ఉన్నత చదువులతో భవిష్యత్ లో మంచి వైద్య సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *