ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ..!
కలిగిరి ఏప్రిల్ 5, మన న్యూస్ ప్రతినిధి,నాగరాజు .

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన విషాదకర బస్సు ప్రమాదంలో కలిగిరి మండలం బొమ్మరాజుచెరువు గ్రామమునకు చెందిన ఆత్మకూరి చిన్నయ్య మృతి చెందిన విషయం విధితమే. వారి కుటుంబ సభ్యులను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వారి స్వగృహానికి వెళ్ళి పరామర్శించారు.ఈ సందర్భంగా బాధలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పుతూ, వారి దుఃఖాన్ని పంచుకున్నారు. చిన్నయ్య ఆకస్మిక మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఈ క్లిష్ట సమయంలో తాను మరియు ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని సహాయ సహకారాలను త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం అవసరమైన ప్రతి సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండల అధ్యక్షుడు పూసల వెంగపనాయుడు, పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,
