కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి కోరిన బాలకృష్ణ నాయుడు.

బంగారుపాళ్యం, మనధ్యాస ,ఏప్రిల్ 2

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలంలోని రాగిమాను పెంట రోడ్డు పరిసర గ్రామాలకు వెళ్లే రహదారి . తారు రోడ్డు మంజూరు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ను కలిసిన రాగిమాను పెంట తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జి బాలకృష్ణ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారుపాల్యం మండల తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు ఎన్.పి జయప్రకాష్ నాయుడు, అధ్యక్షులు ధరణి ప్రసాద్ సహకారాలతో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చొరవతో రాగిమానుపెంట సిమెంటు రోడ్డు పనులను పూర్తి చేసుకున్నామని తదుపరి తారు రోడ్డు విషయమై స్థానిక తెలుగుదేశం నాయకులతో కలసి గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలవడం జరిగిందని కలెక్టర్ రాగిమానుపెంట తారు రోడ్డు సమస్యను అతి తొందరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని రాగిమాను పెంట యూనిట్ ఇంచార్జ్ బాలకృష్ణ నాయుడు బంగారుపాళ్యం ఎక్స్ సింగల్ విండో చైర్మన్ నాగరాజు నాయుడు లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత మండలంలో అత్యధిక నిధులు రాగిమాను పెంట మరియు పరిసర గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో నిధులు కేటాయించినదని గత 25 సంవత్సరములుగా వాటర్ ట్యాంకు రాగిమాను పెంట హరిజనవాడ నందు నిర్మాణం కోసం ఆ ప్రాంత ప్రజలు ఎంతగానో ఎదురు చూశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే ట్యాంక్ పనిని పూర్తి చేసి తాగునీరు అందించామని అలాగే రాగిమానుపెంట పంచాయతీ కి నూతన పశు వైద్యశాల భవనమునకు నిధులు కేటాయించారని ఇందుకుగాను ఎమ్మెల్యే మురళి మోహన్, ఎన్ పి జయప్రకాష్ నాయుడు, ధరణి ప్రసాద్ మరియు కూటమి నాయకులకు మా గ్రామం తరపున అభినందనలు తెలియజేస్తున్నాం అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *