బంగారుపాళ్యం, మనధ్యాస,ఏప్రిల్ 3
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలో గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని లోక్ సభ, రాజ్యసభలలో చట్టభద్రత కల్పించడాన్ని హర్షిస్తూ బంగారుపాళ్యం మండలం బంగారుపాళ్యం రహదారి పై ప్రజలకు ఆటంకం కలగకుండా రహదారి పై భారీ విజయోత్సవ ర్యాలీని బంగారుపాళ్యం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ధరణి ప్రసాద్,పార్టీ గౌరవ అధ్యక్షులు జయ ప్రకాష్ నాయుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు, ప్రధాన కార్యదర్శి జనార్దన్,సింగల విండో చైర్మన్ హేమచంద్రనాయుడు, తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ నాయుడు, కమలనాథ్ రెడ్డి,బి.రవీంద్ర నాయుడు, బంగారుపాళ్యం మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు చిన్నయ్య మరియు కార్యకర్తలు శివ, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా జై అమరావతి జై సీబీన్ జై కూటమి అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రాజధాని ఏర్పాటు అంశం చారిత్రాత్మకమైనది గా మండల పార్టీ అధ్యక్షులు ఎన్.పి ధరణి అభివర్ణించారు.