మన ధ్యాస, నెల్లూరు రూరల్, మార్చి 15 : నెల్లూరు రూరల్ ,31వ డివిజన్, రామకోటయ్య నగర్ సెంటర్ లో 28, 29, 30 & 31 డివిజన్లలో 1 కోటి 85 లక్షల రూపాయలతో పూర్తయిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తట్టెడు మట్టిని రోడ్డు పై వేయలేదు అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పనులు చేయడంలో, నిధులు సాధించడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దిట్ట అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వందలకోట్ల అభివృద్ధి పనులు చేసారు అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 3 ఫేజ్ కరెంటు పనులు నెల్లూరు రూరల్ లో జరిగినట్లు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు వరకే రాజకీయాలు. ఎన్నికలు లేనివేళ అందరం కలసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా ఉండాలి అని పది కాలాలు చెప్పుకునే విధంగా పనిచేస్తాను అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అందరం కలసికట్టుగా సాగి 2029 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 కి 10 స్థానాలు ఒక పార్లమెంటు స్థానాన్ని గెలిచేవిధంగా ముందుకు సాగుదాం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

