మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఫోక్సో చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉంటే క్రైమ్ రేట్ తగ్గుతుందని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అన్నారు.గురువారం ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పడాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోక్సో అవగాహన శిబిరానికి ఏలేశ్వరం మండల ఎంపీపీ మరియు కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అవగాహన దిశగా ఒక మంచి అడుగు వేసిన పడాలా చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులను అభినందించారు. ముఖ్యంగా మహిళలు బాలల భద్రతకు సంబంధించిన పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించడం ప్రస్తుత కాలంలో చాలా అవసరం అని గొల్లపల్లి బుజ్జి అన్నారు.చాలామందికి ఈ చట్టం గురించి సరైన అవగాహన ఉండదన్నారు.18 ఏళ్ల లోపు పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల నుండి వారిని రక్షించడం,పిల్లలపై ఏదైనా నేరం జరిగినట్లు తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్పనిసరన్నారు.ఈ చట్టం కింద నేరస్థులకు కఠినమైన శిక్షలుఉంటాయన్నారు. అలాగే సమాజ సేవలో నిమగ్నమైన పడాల చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను ఎంపీపీ గారు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,ఉపాధి హామీ సిబ్బంది,కూటమి శ్రేణులు మహిళలు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *