
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ వ్యవసాయ పరపతి సంఘం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి నాలుగవ రోజుకు చేరుకుంది. స్థానిక ఏలేశ్వరం వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరవేదిక సమ్మెలో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా మండలంలోని వివిధ పిఎసిఎస్ ల సీఈఓ లు సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు గురువారం సంఘీభావం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జెఎసి) పిలుపుమేరకు ఫిబ్రవరి 16 నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సమస్యల పరిష్కారం పై ఎటువంటి హామీ లభించకపోవడంతో సమస్యలు పరిష్కార అయ్యేంతవరకు సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని జేఏసీ ప్రకటించింది. సమ్మెలో పాల్గొన్న జేఏసీ నాయకులు మాట్లాడుతూ
జి. ఓ నెం. 36 వెంటనే అమలుపరిచి, 2019, 2024 పెండింగ్ లో వున్న వేతన సవరణలు చేయాలి అని, అప్పటివరకు మధ్యంతర భృతి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సిలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలి అన్నారు. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి అన్నారు.2019 తరువాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, వారికి కూడా జి.ఓ నెం.36 అమలు పరచాలన్నారు.ఉద్యోగులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య భీమాను కల్పించి, ఉద్యోగి సర్వీస్ లో మరణిస్తే ఆ కుటుంబం ఆధారము లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇస్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలని, అనేక సంఘాలలో ఉద్యోగుల జీతభధ్యలను డ్యూటు పద్దు నందు ఉంచడం జరిగింది, ఈ డ్యూటు పద్దులను వెంటనే రద్దు చెయ్యాలి. అలాగే పి.ఏ.సి.ఎస్ ల ద్వారా కాకుండా,డి.సి.సి.బి ల ద్వారా రైతులకు డైరెక్ట్ గా ఋణాలు ఇస్తున్నారు. దీనివలన పి.ఏ.సి.ఎస్ నిర్వీర్యం అయిపోవీచున్నని. ఈ విధానాన్ని మార్పు చేసి అన్నీ సేవలు సహకార సంఘాల ద్వారా రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి అన్నారు. సంఘాలు చెల్లించిన షేరు ధనంపై కనీసం 6% డివిడెంట్ లేదా కనీసం 6% వడ్డీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతము పనిచేయుచున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్ లను సీనియార్టీ ప్రాతిపదికిన జిల్లాలో ఖాళీగా ఉన్న సి.ఇ.ఓ పదవులను వీరితో భర్తీ చేసుకోవాలి,
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ డి ఎల్ ఈ సి ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి తదితర డిమాండ్లను జేఏసీ నాయకులు ప్రస్తావించారు. ఈ నిరవధిక సమ్మెలో పిఎసిఎస్ ల ఉద్యోగులు పాల్గొన్నారు.