మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు శనివారం విపత్తు నిర్వహణపై (డిజాస్టర్ మేనేజ్మెంట్ ) పై విద్యార్ధులకు ఒక్క రోజు శిక్షణ శిభిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత ప్రారంభించారు. తరువాత విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ విపత్తు నిర్వహణ అనేది ప్రకృతి లేదా మానవ కారణాల వల్ల సంభవించే విపత్తుల నుంచి ప్రజల ప్రాణాలు,ఆస్తిని రక్షించేందుకు చేపట్టే చర్యల సమాహారం.వరదలు,తుఫానులు,భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి విపత్తులు అకస్మాత్తుగా సంభవించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తు సిద్ధత, ప్రజలలో అవగాహన ఎంతో కీలకమని. విపత్తు సంభవించినప్పుడు తక్షణ రక్షణ చర్యలు చేపట్టడం, సహాయక చర్యలను వేగవంతంగా అమలు చేయడం ద్వారా నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని.అందుకే ప్రతి పౌరుడు విపత్తు నిర్వహణపై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం కాబట్టి విద్యార్ధులందరు శిక్షణ పొంది ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షణ అభియాన్(పి‌ఎం ఉషా ) లో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆద్వర్యలో ఈ శిక్షణ శిభిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శిక్షణ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, కాకినాడ వారిచే ఏర్పాటు చయడం జరిగిందని .ఈ శిక్షణ కార్యక్రమానికి, డా . ప్రయాగ మూర్తి ప్రగడ,కె . సురేశ్,డా. మదీనా, చిన్ని సత్యనారాయణ రాష్ట్ర, విపత్తు నిర్వహణ శిక్షకులుగా కాకినాడ రెడ్ క్రాస్ సొసైటి వారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అద్యాపకులు వి .రామారావు, డా. శివ ప్రసాద్, శ్రీలక్ష్మి, వీరభద్ర రావు,వీరభద్రరావు డా. బంగార్రాజు, సతీశ్, మేరీ రోజలీనా, పుష్పా, రాజేష్ అధ్యాపకేత సిబ్బంది సత్యనారాయణ, ధర్మ రాజు , దివ్య,రామలక్ష్మి కమల,కళావతి ,పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *