మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణంలో 15 వార్డులో దిబ్బల పాలెం,సాయి నగర్ లో ఉన్న పూర్వపు బహిరంగ మరుగుదొడ్డి ఇప్పుడు తుప్పలతో డొంకలతో నిండిపోయి వీధి మధ్యన ఉండటంతో, విషపురుగులు ఇళ్లల్లోకి చేరి,స్థానికులు భయబ్రాంతులకు గురవుతూ ఉంటే, నగర పంచాయతీ కమిషనర్ సూర్య ప్రకాష్ జె సి బి తో ఆ తుప్పలను, డొంకలను, మరియు అందులో ఉన్న వేస్ట్ మట్టిని తొలగించి, ట్రాక్టర్ల ద్వారా బయటికి తరలించే కార్యక్రమం చేపట్టారు. స్థానికులు కమిషనర్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ సూర్య ప్రకాష్ తో పాటు, సానిటరీ ఇన్స్పెక్టర్ శేఖర్, మరియు శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *