
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:
జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగాప్రత్తిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీవో పద్మావతి సూచనలుతో అవగాహన ర్యాలీ చేపట్టారు.ఏలేశ్వరం మండలం కొత్త యర్రవరం గ్రామంలో ఐసిడిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ సూర్య కాలేజీ వద్ద జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతోబాలికలను రక్షిధాం, బాలికలను చదివిధాం అంటూ నినాదాలు తో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపట్టారు, పాఠశాల ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది యస్ ఎల్ వి నాగలక్ష్మి, పి అనతలక్ష్మీ, జ్యోతి, బుజ్జమ్మ, అమ్మాజీ, తదితరులు పాల్గొన్నారు.