మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పపడాలని ఎంపీడీవో శివకృష్ణ అన్నారు.
నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శివకృష్ణ మాట్లాడుతూ..గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా సమానత్వంతో ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గ్రామాలలో పారిశుధ్యం,తాగునీరు,వీధి దీపాలు, ఉపాధి హామీ పనులు సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.ఐసిడిఎస్ సూపర్‌వైజర్ రాజేశ్వరి మాట్లాడుతూ..మహిళలు, చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను గ్రామస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని అన్నారు.ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సుమలత తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం ప్రసన్న రాణి,మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, ఉపాధి హామీ ఎపిఓ శివకుమార్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *