మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన రాజ్య నరేందర్ గౌడ్ బదిలీపై వెళ్లారు.ఆయన స్థానంలో నూతన తహసీల్దార్‌గా మహేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పిట్లం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నూతన తహసీల్దార్ మహేందర్‌కు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మహేందర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పారదర్శకంగా సేవలు అందిస్తానన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తానని, ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.పెద్దకొడప్‌గల్ మండల నూతన తహసీల్దార్‌గా భిక్షపతి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ అనిల్ కుమార్ బదిలీపై వెళ్లారు.ఈ సందర్భంగా పెద్దకొడప్‌గల్ తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది నూతన తహసీల్దార్ భిక్షపతిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన తహసీల్దార్ భిక్షపతి మాట్లాడుతూ..మండల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.