Oplus_131072

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నిన్న రాత్రి డోంగ్లీ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఉప సర్పంచ్ శివాజీ రామరావు పటేల్ ఆకస్మికంగా మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గ్రామానికి వెళ్లి, శివాజీ రామరావు పటేల్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.శివాజీ రామరావు పటేల్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడినిప్రార్థించారు.శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గారు ఓదార్చారు.అనంతరం అంత్యక్రియలలో పాల్గొని పాడె మోసి అశృనయనాలతో వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.శివాజీ రామ రావు పటేల్ ఆకస్మిక మరణం వారి కుటుంబానికి మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటని అన్నారు.గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన ఒక నిబద్ధత,నిజాయితీ గల నాయకుడిని పార్టీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీకి వారు అందించిన సేవలు మరువలేనివి అని,ఒక బలమైన నాయకుడిని కోల్పోవడం పార్టీ శ్రేణులకు దుఃఖాన్ని కలిగిస్తున్నదని భావోద్వేగానికి గురయ్యారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *