
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్చార్జి నీరుకొండ సత్యనారయణ, వారి సతీమణి ప్రస్తుత ఏలేశ్వరం మండల జడ్పీటీసీ నీరుకొండ రామకుమారి, బిజేపి పార్టిలో చేరారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి వి యన్ మాధవ్, విజయవాడ పార్టి కార్యలయం వద్ద కాకినాడ జిల్లా బిజేపి పార్టి అద్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా బిజేపి పార్టిలోకి ఆహ్వానించారు.ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నీరుకొండ సత్యనారాయణ,ప్రస్తుత ఏలేశ్వరం మండల జడ్పిటిసి నీరుకొండ రామకుమారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన దక్షతకు ఆకర్షితులై బిజెపి పార్టీలో చేరామని తెలిపారు.ఈ కార్యక్రమంలోబిజేపి నాయకులు కుండల సాయి కుమార్, గట్టిం వెంకట రమణ,కొల్లా శ్రీనివాస్,అలమండ మధు, బాలాజీ శంకర్ సింగ్,ఏడుకొండ మురళి మనోహర్ కేలంగి వీరబాబు,కె విజయ థామస్,లు పాల్గొన్నారు