తవణంపల్లి జనవరి 4 మన ద్యాస

చిత్తూరుజిల్లాపూతలపట్టునియోజకవర్గం తవనంపల్లి మండలంలోరాజముద్రలతో కూడుకున్న రైతు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని రంగ రంగ వైభవంగా చేపట్టారు.
2024 ఎన్నికల హామీలో భాగంగా ఆరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఎన్నికలప్రచారంలోపాల్గొంటూ …అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రలతో కూడుకున్న పాస్ పుస్తకాలు అందిస్తామని రైతులు హామీ ఇవ్వడం జరిగింది.
ఆరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు రాజముద్ర తో ఉన్న పాస్ పుస్తకాలను తీసేసి,రద్దు , తన ఫోటోతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు అందించి రైతుల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచారు. రైతులందరూ కూడా తన తాత ముత్తాతల సంపాదించినటువంటి భూమికి జగన్ మోహన్ రెడ్డి యొక్క ఫోటోతో పాస్ పుస్తకం ఏమిటి ?అని ఆరోజు ఆవేదన వ్యక్తం చేశారుఎంతో ఆందోళన చెందారుఈ నాడు చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి రైతుకి రాజముద్రతో కూడుకున్నటువంటి రైతు పట్టాదారు పాస్ బుక్ ఇవ్వడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేదు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిషేదిత జాబితాలో వందలాది ఎకరాలు భూములు నిషేధించేజాబితా( 22ఏలో) పెట్టి రైతులని ,ప్రజల్ని వేధింపులకు గురి చేసింది, పెద్ద ఎత్తున రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడింది, ఎవరైతే తన మాట వినలేధో,స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు అప్పటి రెవిన్యూ అధికారుల అండతో, అనుభవంలోని భూములను నిషేధిత జాబితాలో పెట్టి, వాళ్లకి బ్యాంకులో లోన్లు లేకుండా, క్రయవిక్రయాలు చేరుకోకుండా అడ్డుకొని వేధింపులు గురిచేసింది. పైగా 22 జాబితా నుండి తొలగించడానికి డబ్బులు వసూలు, చేసి కోట్లాది రూపాయలు చేతులు మారింది.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వివాదంగా, భూములన్నిటిని ప్రభుత్వం, ప్రజల ప్రైవేట్ భూముల్ని నిషేధిత జాబితా 22 ఏ నుండి తొలగించి రైతులకు, సంపూర్ణ హక్కులు కల్పించింది.
అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దుచేసి ,ప్రజలకి మనో ధైర్యాన్ని కల్పించింది.
ఈ యొక్క పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో టిడిపి రైతు నాయకులు రైతు కార్యదర్శి జైపాల్, బాబు నాయుడు, బీసీ సెల్ నాయకుడు రామచంద్ర, మోహన్ రెడ్డి , బిజెపి నాయకులు బాలచంద్ర, పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *