60,లీటర్ల నాటు సారాయి 3000 లీటర్ల బెల్లపువూట ధ్వంసంచేసిన సిఐ సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం

మన ధ్యాస ప్రతినిథి ప్రతిపాడు: ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామశివారున నాటుసారా స్థావరం పై ప్రత్తిపాడు పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. పోలీసులుకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు,
ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు, ఎస్సై లక్ష్మికాంతం, అధ్వర్యంలో తమ సిబ్బంది దాడులు నిర్వహించారు.సంఘటన స్థలములో సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులు అదుపులోకి తీసుకొన్నారు..
వారి వద్ద నుండి 60 లీటర్ల నాటు సారాయిని,నాటు
సారాయి కాసేందుకు ఉపయోగించే 3000 లీటర్లు అమ్మోనియా కలిపిన బెల్లపు ఊటను,నాటుసారాని తయారు చేయడానికి ఉపయోగించిన సామాగ్రిని పోలీసులు ధ్వంసం చేశారు.అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలిస్తామని అన్నారు.ప్రత్తిపాడు మండలంలో ఎక్కడైనా నాటుసారా కాసిన మరియు రవాణా చేసిన అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని
సీఐ సూర్య అప్పారావు, ఎస్సై లక్ష్మీకాంతం హెచ్చరించారు.అక్రమాలకు పాల్పడుతున్న వారి సమాచారం తెలిపేందుకు ఈ క్రింది నెంబర్లు
ప్రత్తిపాడు ఎస్ఐ 9440796570,
సిఐ 9440796530, తెలియపరచాలని సందర్భంగా కోరారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *