
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం
స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 25 వ తేదీన జరుగనున్న జిన్నో సమిట్ (XINNO Summit)
ఎక్స్ట్రీమ్ ఇన్ ఇన్నోవేషన్
2026కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను కాకినాడ జిల్లా ఎస్పి జి. బిందుమాధవ్,IPS చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ సమ్మిట్ 2026 జనవరి 25న ఏలేశ్వరం వేదికగా జరగనుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పి బిందు మాధవ్ హాజరవుతారని. సంస్థ ఛైర్మన్ సాయి సందీప్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పి. బిందు మాధవ్ మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఎక్స్ట్రీమ్ ఇన్ ఇన్నోవేషన్ 2026లో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలు, ఇన్నోవేటర్లతో నేరుగా కలుసుకుని వారి ఆలోచనలను తెలుసుకోవడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు.ఈ భారీ సమ్మిట్‌ను గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించేందుకు ముందుకు వచ్చిన స్పార్క్ సంస్థను ఆయన అభినందించారు. స్పార్క్ చైర్మన్ సందీప్, సంస్థ సి ఈ ఓ ప్రదీప్ ను అభినదించారు.గ్రామీణ యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసి, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్స్ రంగాల్లో మార్గదర్శకంగా నిలిచే వేదికగా XINNO Summit 2026 నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.