మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్. మండలంలోని గున్కూల్ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పెట్టి చిత్తు బొత్తు బొమ్మబోరుసు ఆట ఆడుతున్నారని అందిన సమాచారంతో నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ పోలీస్ సిబ్బంది తో కలిసి రైడ్ నిర్వహించారు.
రైడ్ సమయంలో ఐదుగురు వ్యక్తులు చిత్తు బొత్తు బొమ్మబోరుసు ఆట ఆడుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లు ,రూ.37,670 నగదును సీజ్ చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.పేకాట,ఆన్ లైన్ మట్కా, జూదం,పాల్పడే వారి సమాచారం ఇవ్వాలని కోరారు.సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.ఎస్ఐ శివకుమార్ తోపాటు పోలీస్ సిబ్బంది వీరభద్ర, రవి, అన్వేష్, ప్రవీణ్ ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *