మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :ఏలేశ్వరంమండలం లో
అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘము సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఏర్పాటు పై కార్మికులు చర్చించారు. సుమారు 200 మంది కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాపీ మేస్త్రిలు, డైలీ కూలీలు సమూహంగా ఏర్పడి వారి సలహాలతో, సూచనలతో ఏలేశ్వరం కు చెందిన పాడ్రింకి సూర్యప్రసాద్ ను అధ్యక్షులుగా, పలికల శ్రీను కార్యదర్శిగా, ఉపాధ్యక్షులు గా మజ్జి శ్రీను, జాయింట్ సెక్రెటరీ దొంతల అప్పారావు, కోశాధికారి నందకూరి నాగ శంకర్, జాయింట్ క్యాషియర్ ఎర్ర శ్రీనివాసరావు,సభ్యులుగా గుండుబెల్లి చక్రం, సరుగోలు చిన్న అప్పారావు, బూర్ల శ్రీనివాసరావు, మామిడాల వెంకటరమణ, ఏనుగు వీర వెంకటరమణ, శిడగం సంజీవి, బూడి వీరరాఘవ, ముత్యాల రాజు, ముంజేటి భద్రం, గొలగన అప్పారావు, సర్నీడ్డి రామకృష్ణలతో కమిటీ ఏర్పాటు చేశారు.గౌరవ అధ్యక్షులుగా నందకూరి నాగ శంకర్, చల్లా త్రిమూర్తులు, జమ్ము పాండు, కిలాడి వీరబాబులను భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీగా ఏర్పడ్డారు. అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘం గా ఈ నూతన సంఘానికి నామకరణం చేశారు. వై ఆర్ సి కాలనీ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు భవన నిర్మాణ నూతన కమిటీ, కార్మికులు బైకులు సైకిల్ తో ర్యాలీగా వచ్చి సెంటర్లో కేక్ కట్చేసారు. సంఘ నిర్మాణం మొదటి మీటింగు ఫిబ్రవరి ఒకటవ తారీఖున ఏర్పాటు చేసి సంఘ నియమ నిబంధనలు తదితర అంశాలపై చర్చించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా నూతన కమిటీ తెలియజేశారు.ఈ నూతన కమిటీకి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *