.మన ధ్యాస,నెలూరు, డిసెంబర్ 26: నెల్లూరు పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షుడు మొయినుద్దీన్ మాట్లాడుతూ………….ముస్లిం సామాజిక వర్గం అత్యంత పేదరికంలో ఉండి విద్యకు దూరమవుతున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయి విద్య అందించేందుకు ముందుకు వచ్చిన అబ్దుల్ అజీజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అడిగిన వెంటనే స్పందించి స్థలాన్ని పరిశీలించి అంతర్జాతీయ స్కూల్ నిర్మించేందుకు 15 కోట్లు సమీకరించేందుకు ముందుకు వచ్చిన నారాయణకు ధన్యవాదాలు తెలిపారు.నారాయణ, అజీజ్ కలిసి గతంలో బారాషహీద్ దర్గాను, పిఎన్ఎం జూనియర్ మహిళా కళాశాలను షాది మంజిల్ ను అభివృద్ధి చేశారని, వీరు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.ఆ 13 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు దని వక్ఫ్ బోర్డు ఆధీనంలో మాత్రమే స్కూల్ ను నడపబోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి జాఫర్ షరీఫ్ మాట్లాడుతూ…………ముస్లిం సామాజిక వర్గానికి మంత్రి నారాయణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కలిసి ఇంటర్నేషనల్ స్కూల్ రూపంలో ఒక అమూల్యమైన బహుమతిని ఇవ్వబోతున్నారని తెలిపారు. 15 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులు ఖర్చుపెట్టి సౌత్ ఇండియాలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటి వక్ఫ్ బోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించబోతున్నారని తెలిపారు.ముస్లిం సామాజిక వర్గం తరఫున మంత్రి నారాయణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ మాట్లాడుతూ………….నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో స్వర్ణ అక్షరాలతో లిఖించబడే పేరు అబ్దుల్ అజీజ్ అని, కార్పొరేషన్ గా ఆయన పని చేసిన విధంగా మరే మేయర్ పనిచేయాలేరన్న విధంగా పనిచేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబ్దుల్ సిస్పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని వక్ఫ్ బోర్డు లో అనేక ప్రక్షాళనలు చేసి, సంస్కరణలు తీసుకొని వచ్చారని తెలిపారు. నెల్లూరులోని 13 ఎకరాల వర్క్ భూమిలో 5 ఎకరాలలో జామియా ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్మించబోతున్నారని 15 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ ను సమకూర్చిన నారాయణ కు, ముస్లిం సామాజిక అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న అబ్దుల్ అజీజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.వక్ఫ్ బోర్డు చరిత్రలో ఇప్పటివరకు అబ్దుల్ అజీజ్ లాంటి చైర్మన్ రాలేదని, రాబోడని పేర్కొన్నారు.మీడియా సమావేశంలో 42 వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా, జహీర్, ఇంతియాజ్, ఇక్బాల్, కాలేషా, పాషా మొహిద్దిన్, నౌషాద్, రఫీ, పాల్గొన్నారు.


