మన ధ్యాస నెల్లూరు,డిసెంబర్ 26: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీపర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు..వైఎస్ఆర్సిపి యువజన విభాగం నగర అధ్యక్షులుగా సుంకర సందీప్ ని, వైఎస్ఆర్సిపి నగర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా పసుపులేటి హేమంత్ ని నియమించిన సందర్బంగా.. నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆఫీస్ లో నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగజయ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 300 మంది యువతతో వారు ర్యాలీగా తరలి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని గజమాలతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తానని వారు తెలిపారు.రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని వారు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ……వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నెల్లూరు నగర నియోజకవర్గంలో బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి లో పార్టీని ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు నిచ్చే విధంగా పార్టీ పదవులు కేటాయించి వారికి ప్రత్యేక గౌరవం కల్పించడం జరుగుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేసేందుకు యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. 47వ డివిజన్ నాయకులు సుంకర సందీప్ ను నగర యువజన విభాగం అధ్యక్షులుగా, పసుపులేటి హేమంత్ కు నగర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా పార్టీ పదవుల్లో నియమించడం జరిగిందన్నారు.ఇప్పటికే కూటమి ప్రభుత్వ పనితీరుతో ప్రజలు విసగిపోయి నాయకత్వ మార్పు కోరుకుంటున్నారని అన్నారు.ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ అన్ని విధాల అభివృద్ధి.. చెందుతుందన్నారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





