మన ధ్యాస, తోటపల్లి గూడూరు, డిసెంబర్ 26: నెల్లూరు జిల్లా,తోటపల్లిగూడూరు మండలం, వెంకన్నపాళెంలో శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రూ.70 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డుకు ప్రారంభించినారు. అనంతరం రూ.36 లక్షలతో చేపట్టిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన సోమిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన వెంకన్నపాళెం వాసులు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…… సర్వేపల్లి నియోజకవర్గంలో నాబార్డ్, పీఆర్ఆర్ ప్లాన్, ఉపాధి హామీ పథకం కింద రూ. 24.53 కోట్లతో పలు రోడ్ల పనులు చేపట్టాం అని అన్నారు.నేషనల్ హైవే నుంచి రామదాసుకండ్రిగ మీదుగా పూడిపర్తి రోడ్డుకు రూ.4.06 కోట్లు మంజూరయ్యాయి అని తెలిపారు.రూ. 3.65 కోట్లతో మహాలక్ష్మిపురం నుంచి కోడూరు బీచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి అని అన్నారు.ఆర్ అండ్ బీలో రూ.15 కోట్లతో మరికొన్ని రోడ్ల పనులు ప్రారంభంకాబోతున్నాయి అని తెలిపారు.ఇరిగేషన్ శాఖలో రూ.16.70 కోట్లతో పనులు జరగబోతున్నాయి అని అన్నారు.39 గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.13.71 కోట్లు మంజూరు చేసింది అని అన్నారు.ఒక్కో పంచాయతీ కార్యాలయాన్ని రూ.32 లక్షలతో 10 కట్టబోతున్నాం అని తెలిపారు.ఇన్ని పనులు జరుగుతుంటే కాకాణి తిన్నది అరగక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని అన్నారు.ఓ అండ్ ఎం కింద గత ఏడాది 160 పనులను రూ.12 కోట్లతో ఏ ఊరికి ఆ ఊరిలో రైతుల భాగస్వామ్యంతో నాణ్యతతో చేశాం అని అన్నారు.వైసీపీ పాలనలో ఎన్నికలకు మూడు నెలల ముందు చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసినా రూ.18.50 కోట్లతో ఐదు ప్యాకేజీలతో పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు అని తెలిపారు.మా ప్రభుత్వం వచ్చాక ఫలనా పని చేయకుండానే బిల్లులు చేసుకున్నారని చెప్పే దమ్ము కాకాణికి ఉందా సవాల్ విసిరారు.వరుస తుఫాన్లు, భారీ వర్షాలతో పలు కాలువలకు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్నారు.కాలువల మరమ్మతులకు రూ.16.70 కోట్లు ఎఫ్.డీ,ఆర్ నిధులు మంజూరయ్యాయి..ఇంకా పనులు ప్రారంభించాల్సివుంది అని తెలిపారు.ఆ పనులు చేస్తేనే బిల్లులు మంజూరు చేస్తారు..ప్రతి పని రైతుల పర్యవేక్షనలో జరుగుతుంది అని అన్నారు.ఈ పనులు జరిగిన తర్వాత కూడా ఏ ఊరికి వెళ్లి అయినా పరిశీలించుకోవచ్చు..ఏ ఒక్క పని అయినా చేయకుండా బిల్లులు చేసుకున్నారని నిరూపించు..బాధ్యులపై అప్పటికప్పుడే కేసు పెట్టిస్తా అని అన్నారు.వైసీపీ పాలనలో మాదిరిగా పనులు చేయకుండానే కార్యాలయంలో కూర్చుని బిల్లులు చేసుకోవడం మా ప్రభుత్వంలో కుదరదు అని అన్నారు.కాకాణి మాదిరిగా పేపర్లపైనే పనులు చేసి కరోనా ప్యాలెస్ లో కోట్లు స్టాక్ చేసే సంస్కృతి మాది కాదు అని అన్నారు.2015లో కండలేరు స్పిల్ వే నుంచి 44 వేల క్యూసెక్కుల వరదను విడుదల చేస్తే అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి..ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా ఆయనే అని అన్నారు.ఆ స్థాయిలో వరద వస్తే 100 క్యూసెక్కుల డిశ్చార్జీ లేదని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు.వరద వస్తే ప్రమాదమని అధికారులు అప్రమత్తమై పనులను ప్రతిపాదించారు..ప్రతిపాదనలు వెళ్లిన తర్వాతే మాకు తెలిసింది అని అన్నారు.పర్వతాపురం, అంకుపల్లి, వావింటపర్తి గ్రామాలకు వెళ్లి ఆ పనులు అవసరం లేదని కాకాణి చెప్పగలడా అని అన్నారు.కాకాణి కాని ఆ మాట చెబితే ఆ పనులు వద్దని నేనే ప్రభుత్వానికి లేఖ రాస్తా అని తెలిపారు.రైతుల విషయంలో కాకాణి వ్యవహరిస్తున్న తీరు సహించరానిది అని అన్నారు.ఇలాంటి వ్యక్తులను మంత్రిగా, జిల్లా అధ్యక్షులుగా ప్రోత్సహిస్తున్న జగన్ రెడ్డిని అనాలి..కాకపోతే ఆయన కూడా అదే టైపు కాబట్టి ఇద్దరికీ సరిపోయింది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *