మన ధ్యాస,నెల్లూరు, డిసెంబర్ 25 :నెల్లూరు సంతపేట కేథడ్రల్ చర్చ్ లో బాలయేసు జన్మదిన వేడుకలకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై బాలయేసు పుట్టుక ఘట్టాన్ని..తిలకించి.. బాలయేసుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్బంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి యేసుక్రీస్తు ప్రభువును దర్శించుకుని క్రీస్తుకు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.అనంతరం బిషప్ MD ప్రకాశం పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి క్రీస్తు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…….క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సంతపేట పెద్ద చర్చిలో ప్రార్థనలకు హాజరవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.సమాజం బాగుండాలి సమాజంలో శాంతి, సౌభాగ్యం, వెళ్లి విరియాలన్న ఆకాంక్షతో యేసుప్రభువుకు ప్రార్థనలు చేయడం జరిగిందన్నారు.క్రైస్తవులు అంటే ప్రధానంగా దయ, ప్రేమ, క్షమ, సేవ గుణాలు కలిగి కలిగి ఉంటారని తెలిపారు.ఈ సమాజంలో కూడా ప్రజల మధ్య ప్రేమ, దయా,క్షమ, సేవా గుణాలు అలవరాలని ప్రభువుకు వారు ప్రార్థనలు చేస్తుంటారని అన్నారు.క్రైస్తవులందరూ ఐక్యంగా క్రిస్మస్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *