మన ధ్యాస, పొదలకూరు,డిసెంబర్ 26 :కాకాణి ఎన్ని జన్మలెత్తినా సోమిరెడ్డిని అవినీతిపరుడిగా చిత్రీకరించలేరు అని తలచీరు మస్తాన్ బాబు అన్నారు శుక్రవారం పొదలకూరులో మీడియాతో టీడీపీ మండల అద్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ…….అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి అవాకులు చెవాకులు పేలడమే పనిగా పెట్టుకున్నాడు అని అన్నారు.వైసీపీ హయాంలో ఇరిగేషన్ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని మేం ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నాం అని అన్నారు.పనులు చేయకుండానే చేసినట్టు చూపి బిల్లులు చేసుకున్న ఘటనలపై విచారణ జరపాలని కూడా మా నాయకుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి కోరుతూ వచ్చారు అని అన్నారు.ఇరిగేషన్ లో షట్టర్ల వ్యవస్థ కీలకమైనది. ఒక్కసారి బిగిస్తే కొన్నేళ్ల పాటు అవి వుంటాయి..అలాంటి శాశ్వతమైన పనులను కూడా చేయకుండానే చేసినట్టు బిల్లులు చేసుకున్న పెద్దమనిషి కాకాణి గోవర్ధన్ రెడ్డి అని అన్నారు.విచారణలో తన అవినీతి లీలలు బయటపడుతాయనే కంగారుతోనే కాకాణి ఎదురుదాడికి దిగుతున్నాడు అని అన్నారు.ఇటీవల వచ్చిన రెండు తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న కాలువల మరమ్మతులకు జిల్లాలో రూ.97 కోట్లు, సర్వేపల్లికి రూ.17 కోట్ల ఎఫ్.డీ.ఆర్ నిధులను కలెక్టర్ మంజూరు చేశారు అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో 316 పనులను గుర్తించారు….ఇప్పటి వరకు పనులకు అనుమతులు మాత్రమే వచ్చాయి..ఇంకా పనులు ప్రారంభం కాలేదు అని అన్నారు.ప్యాకేజీల రూపంలో కోట్లు కాజేయడమే పనిగా పెట్టుకున్న కాకాణి ఇంకా ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారు అని అన్నారు.ఆ ఊహల్లోనే మునిగితేలుతూ ఎఫ్.డీ.ఆర్ నిధులతో చేపట్టే 316 పనులను ఎక్కడ చేశారని ప్రశ్నిస్తున్నారు అని అన్నారు.ఇంకా ప్రారంభమే కాని పనులను ఎక్కడ చేశారో చూపాలనడం హాస్యాస్పదం అని అన్నారు.కాకాణి వ్యాఖ్యలు చూసి ఆయనకు మతిభ్రమించినట్టుగా గ్రామాల్లో రైతులు చర్చించుకుంటున్నారు అని అన్నారు.రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే స్వాగతిస్తాం అని అన్నారు.అలా కాకుండా తమ అవినీతి, దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు ఏ ఊరికి వెళ్లినా సోమిరెడ్డిపై కావ్ కావ్ కావ్ మని కారుకూతలు కూయడం సిగ్గుచేటు అని అన్నారు.కాకాణి తనకు అంటిన అవినీతి మరకను సోమిరెడ్డికి అంటించాలనే ప్రయత్నంలో ఉన్నాడు అని అన్నారు.విజ్ఞత కలిగిన ప్రజలు అన్నీ గమనించే కాకాణి గోవర్ధన్ రెడ్డిని కరోనా ప్యాలెస్ కు పరిమితం చేశారు అని అన్నారు.గతంలోనూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడిపై కాకాణి అనేక ఆరోపణలు చేశాడు..ఏకంగా నకిలీ పత్రాలు కూడా చేయించాడు అని అన్నారు.ఐదేళ్లు అధికారం వెలగబెట్టినా ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోగా సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు అని అన్నారు.కాకాణి ఆరోపణల్లో పస లేదనే విషయం ఇప్పటికే అనేక మార్లు నిరూపించాం అని అన్నారు.సోమిరెడ్డిని అవినీతిపరుడిగా చిత్రీకరించడం కాకాణి తరం కాదు అని అన్నారు.చేసిన పాపాలకు ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నా కాకాణి బుద్ధి, మనస్థత్వం మాత్రం మారడం లేదు అని అన్నారు.రాజకీయాల్లో హుందాకరమైన విమర్శలను ఎవరైనా హర్షిస్తారు అని అన్నారు.ఒకసారేమో లేనిపోని విమర్శలు చేస్తాడు..మరోసారి వ్యక్తిత్వ హననానికి దిగుతాడు..మరీ ప్రస్టేషన్ కు పోతే ఏకంగా బూతులు మాట్లాడుతాడు అని అన్నారు.ఇలాంటి వ్యక్తి ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనూ ఎవరూ లేరు అని అన్నారు.ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సోమిరెడ్డిపై హిజ్రాలను దాడికి ఉసిగొల్పిన వ్యక్తిగా తెలుగు రాజకీయాల చరిత్రలో కాకాణి నిలిచిపోతాడు అని అన్నారు.వైసీపీ పాలనలో కాకాణి దుర్మార్గలపై ప్రశ్నిస్తే అనేక రకాలుగా వేధించాడు..అక్రమ కేసులు బనాయించి అమాయకులను జైళ్లకు పంపాడు..ఏ నేరం చేయని వారిపైనా రౌడీషీట్లు తెరిపించాడు అని అన్నారు.దుర్మార్గాలకు సహకరించని అధికారులను వేధించి ట్రాన్ఫఫర్లు చేయించి వేధించాడు అని అన్నారు.ఇప్పుడు నిజాయతీగా పనిచేస్తుంటే అవినీతి అంటూ నోరుపారేసుకుంటున్నాడు అని అన్నారు.పేదలకు ఉపయోగపడే పనులకు నిధులు తెస్తే కమీషన్లు అంటూ కారు కూతలు కూస్తాడు అని అన్నారు.పెళ్లికెళ్లినా, చావుకెళ్లినా, కరమంత్రానికి వెళ్లినా సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు పేరు తలుచుకోకుండా బయటకు రావడం లేదు అని అన్నారు.నోటికొచ్చిన మాటలు తప్ప ఏడాదిన్నర కాలంలో విధానపరంగా చేసిన ఒక్క విమర్శ అయినా ఉందా అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఇరిగేషన్ శాఖ పరంగా మేం చేసిన ప్రతి పనిని చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.కాకాణి ఏ పనిని ప్రస్తావించినా చూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..కాకాణికి కళ్లు బాగుంటే వచ్చి చూసుకోవచ్చు అని అన్నారు.పనులు చేయకుండానే చేసినట్టు బిల్లులు చేసుకునే సంస్కృతి మాది కాదు..అలాంటి దుర్మార్గాలను మా నాయకుడు సోమిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించరు అని అన్నారు.వైసీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లూ రైతుల పేరుతో అడ్డంగా దోచుకున్నారు..ఒక్క కాలువలోనూ పార పెట్టిన పాపాన పోలేదు అని అన్నారు.కొందరు కాంట్రాక్టర్లను పెట్టుకుని ప్యాకేజీల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేశారు అని అన్నారు.మా ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండదు…ప్రతి పనిని రైతుల భాగస్వామ్యంతో, రైతుల పర్యవేక్షణలో పారదర్శకంగా చేస్తాం అని అన్నారు.యూరియా కొరత సమస్య ప్రతి ప్రభుత్వంలోనూ, ప్రతి సీజన్ లోనూ వస్తోంది అని అన్నారు.కాకాణి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా యూరియా కోసం ధర్నా చేసిన మాపై కేసులు పెట్టి జైళ్లకు పంపించాడు అని అన్నారు.వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు ఒక్క బస్తా యూరియా కూడా దక్కకుండా చేశారు అని అన్నారు.మా ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు…రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకూ యూరియా అందిస్తున్నాం అని అన్నారు.కాకాణికి తెలియకపోతే నియోజకవర్గంలోని ఏ గ్రామంలో వైసీపీ నాయకుడిని, కార్యకర్తను అడిగినా ఈ విషయం చెబుతారు అని అన్నారు.ఏ రైతుకి అవసరమైనా యూరియా సిద్ధంగా ఉంది. రైతుల అవసరాల మేరకు యూరియాను అందించేందుకు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందున్నారు.వ్యవసాయ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *