మన ధ్యాస ప్రతినిథి శంఖవరం:నేటి బాలలే రేపటి పౌరులు వీరిని పోలియో మహమ్మారి నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని,ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వజ్రకూటం మాజీ సర్పంచ్,ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ అన్నారు.ఆదివారం వజ్రకూటం గ్రామంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు వినాయకుని ఆలయం వద్ద ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు అయన చేతుల మీదుగా వేశారు.ఈ సందర్భంగా కీర్తి వెంకట సుభాష్ మాట్లాడుతూ ఒకప్పుడు పోలియో పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎందరో చిన్నారులు ఈ వ్యాధి బారిన పడి జీవితాంతం అంగవైకల్యంతో నరకయాతన అనుభవించారని, గతంలో పడిన ఆ ఇబ్బందులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పోలియో నిర్మూలనను ఒక నిరంతర యజ్ఞంలా కొనసాగిస్తున్నాయని అన్నారు.వైద్యారోగ్య సిబ్బంది, ఏ.ఎన్.ఎం. లు,ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పోలియో రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరాటంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని,చిన్నపాటి నిర్లక్ష్యం ఒక బిడ్డ జీవితాన్ని చీకటిమయం చేస్తుందని,అందుకే ప్రతి ఇంట్లో ఉన్న చిన్నారికి చుక్కల మందు వేయించి రక్షణ కవచం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన తెలియచేసారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *