మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: పోలియో రహిత సమాజం కోసం 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పోతులూరు మాజీ సర్పంచ్ పంచాది వీరబాబు అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించి స్వయంగా చిన్నారులకు ఆయన చేతుల మీదుగా పోలియో చుక్కలు వేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగులాపల్లి బాబ్జి,ఉప సర్పంచ్ బర్ల చక్రం,నాయకులు నాగులాపల్లి రాంబాబు,నాగులాపల్లి సూరిబాబు, శెట్టి బాబులు,సిద్దా దొర,బుడంకాయల కొండబాబు,పసుపులేటి సత్యనారాయణ,చేనుబోయిన నాగార్జున,విద్యా కమిటీ చైర్మన్ కుంచె కృష్ణ, వైద్య ఆరోగ్య సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *