
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: మండల పరిధి లింగంపర్తి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు.లింగంపర్తి గ్రామ సచివాలయం వద్ద ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమంలో భాగంగా లింగంపర్తి గ్రామంలో పుర వీధుల గుండా స్వచ్ఛ ఆంధ్ర నినాదాలు చేస్తూ పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంల ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు,ఎస్సీ సెల్ కార్యదర్శి నూకతాటి ఈశ్వరుడు, బిజెపినాయకులు కరిణి సత్యనారాయణ, గెడ్డం సత్తిబాబు, గ్రామ సచివాలయ కార్యదర్శి సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.