మన ధ్యాస, ముత్తుకూరు, డిసెంబర్ 19: నెల్లూరు జిల్లా ,ముత్తుకూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం అంగన్ వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిమీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ……..అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం రూ.14 వేల విలువైన సెల్ ఫోన్ ను అందిస్తోంది అని అన్నారు.జిల్లా వ్యాప్తంగా 2934 అంగన్ వాడీ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారికి ఈ సెల్ ఫోన్లను అందిస్తున్నారు అని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించింది..నా సోదరి మంత్రి సంధ్యారాణికి ధన్యవాదములు తెలిపారు.మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చిన్నారులు, మహిళలకు సేవలు అందించేందుకు ఈ సెల్ ఫోన్లు తోడ్పడుతాయి అని అన్నారు.ఉన్నతాధికారులు ఇచ్చే సూచనలు, ఆదేశాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు దోహదం చేస్తాయి అని అన్నారు.అనేక అంగన్ వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి..వాటిని పూర్తి చేసి వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం అని అన్నారు.చిన్నారులను సొంత బిడ్డల్లా ఆదరిస్తూ సేవలు అందిస్తున్న అంగన్ వాడీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని అన్నారు.ప్రభుత్వం వారి సేవలను గుర్తించి వేతనాలను రూ.7 వేలు నుంచి రూ.11500కి పెంచింది అని అన్నారు.గిరిజనులు, దళిత బిడ్డలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సిబ్బందికి నా సూచన అని అన్నారు.ప్రత్యేకంగా ప్రతి గిరిజన బిడ్డ అంగన్ వాడీ కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తీసుకునేలా చూసుకోవాలి అని అన్నారు.సమాజంలో అత్యంత అమాయకులైన గిరిజనుల అభ్యున్నతి విషయంలో నేను కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో 50 వేల మంది గిరిజన బిడ్డలు ఉన్నారు అని అన్నారు.ఇప్పటికే 11 గిరిజన కాలనీలను పామాయిల్ కంపెనీలు దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాను అని అన్నారు.ఈ విషయంలో అదానీ ఫౌండేషన్, ఎస్ ఇ ఐ ఎల్ కంపెనీలు కూడా ముందుకొచ్చాయి…ఇప్పటికే పలు కంపెనీలు తమ కార్యాచరణ కూడా ప్రారంభించాయి అని అన్నారు.గిరిజన కాలనీల్లో అవసరమైన వసతులు కల్పించడంతో పాటు వారి ఆర్తికాభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నారు అని అన్నారు.ప్రజల ఆరోగ్యంపైనా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది…సర్వేపల్లి నియోజకవర్గంలో 39 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి రూ.13.78 కోట్లు మంజూరు చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.తాళ్లపూడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.1.43 కోట్లు, ముత్తుకూరు, తాళ్లపూడిలో బ్లాక్ హెల్త్ యూనిట్ల నిర్మాణానికి మరో రూ. కోటి మంజూరయ్యాయి అని అన్నారు.దాదాపు అన్ని గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ లకు భవనాలు అందుబాటులోకి రాబోతున్నాయి అని అన్నారు.ముత్తుకూరు – మామిడిపూడి రోడ్డు నిర్మాణానికి రూ.2.16 కోట్లు మంజూరు చేయించాం అని అన్నారు.అంగన్ వాడీ భవనాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిధులు తీసుకొస్తాం అని అన్నారు.






