కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

గుంటూరు, మన ధ్యాస న్యూస్, (నాగరాజు కె).

శనివారం గుంటూరులో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి ,గుంటూరు పార్లమెంట్ సభ్యులు,పెమ్మసాని చంద్రశేఖర్ ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కలిశారు.ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం లోని గ్రామీణ అభివృద్ధి గురించి,గృహ నిర్మాణాల కొరకు కాలనీల మంజూరు గురించి, రోడ్లు,భవనాలు,సెల్ ఫోన్ టవర్ల అభివృద్ధి అంశాలపై చర్చించి, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని,ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పెమ్మసాని చంద్రశేఖర్ ని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *