నియోజకవర్గంలో సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు 21 బిఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరు…బిఎస్ఎన్ఎల్ టవర్లకు త్వరితగతిన స్థలం కేటాయించండి
నెల్లూరు,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 09,(నాగరాజు కె)
మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు మరో అడుగు పడనుంది.టెలికాం చైర్మన్ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న సిగ్నల్ సమస్యను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీసుకెళ్లేరు.ఎమ్యల్యే ఆదేశాలతో టెలికాం డైరెక్టర్ తాటికొండ అనూష నియోజకవర్గంలో ఏ ఏ ప్రాంతాలలో అవసరమందో గుర్తించి,వాటి మంజూరు దశగా పని చేస్తున్నారు.నియోజకవర్గంలో మొత్తం 21 బిఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటుకు కావలసిన స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో తహసిల్దార్లతో సమావేశం కూడా నిర్వహించారు.అయినప్పటికీ స్థలం కేటాయింపు లో ఉన్న సమస్యలను అధిగమించేందుకు,త్వరితగతిన భూ కేటాయింపు జరిపేందుకు బిఎస్ఎన్ఎల్ టెలికాం డైరెక్టర్ తాటికొండ అనూష సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ని కలిసి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ త్వరలోనే బిఎస్ఎన్ఎల్ టవర్లకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ ఆదేశాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా తాటికొండ అనూష మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 21 బిఎస్ఎన్ఎల్ టవర్ ను పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయి. అయితే రెవెన్యూ అధికారుల ద్వారా టవర్లకు అవసరమైనటువంటి భూమి కేటాయింపు అందించడంలో కొంత ఆలస్యం జరుగుతుందని ఈ విషయాన్ని స్థానిక పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ దృష్టికి తీసుకొని వెళ్లగా వారి ఇరువురు సహాయ సహకారాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని త్వరలోనే పూర్తిస్థాయి టవర్లుకు భూమి కేటాయింపు పూర్తి చేసి అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మెట్ట ప్రాంత అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బిఎస్ఎన్ఎల్ టీం మెంబెర్ మారినేని రామకృష్ణ, సీనియర్ నాయకులు మల్లంపాటి కొండలరావు తదితరులు పాల్గొన్నారు







