ఉదయగిరి,మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 4,(కె నాగరాజు).
ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయం లో మృతదేహం నేడు లభ్యమైంది. వివరాలు మేరకు… ఉత్తరప్రదేశ్ కు చెందిన సౌరబ్ అనే యువకుడు గత మూడు రోజుల క్రితం వరికుంటపాడు మండలంలోని గువ్వాడి గ్రామానికి పనుల నిమిత్తం వచ్చి, సరదాగా తన స్నేహితులతో గండిపాలెం జలాశయాన్ని సందర్శించడానికి వెళ్లిన అతను, ఒకసారి గా జలాశయంలో పడి గల్లంతవ్వడం, అందర్నీ కలిసి వేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది,అధికారులు… యువకుడు కోసం ఎంతగానో గాలింపు చర్యలు చేపట్టగా రెండు రోజుల వరకు ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.. నేడు గురువారం మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తదుపరి తమ కుటుంబ సభ్యులకు అప్పగించన నట్లు పోలీసులు తెలిపారు








