ఉదయగిరి మండలంలో గ్రామ కమిటీల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

ప్రజల వద్ద నుండి వినతల స్వీకరణ.సమిష్టిగా పనిచేద్దాం పార్టీ అభ్యున్నతికి తోడ్పడదాం.

ఉదయగిరి డిసెంబర్ 4 మన ధ్యాస, (నాగరాజు కె)

ఉదయగిరి మండల పరిధిలోని పలు పంచాయతీలలో నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశాల్లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలో తేడాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలనే పిలుపును ఆయన అందించారు. అభివృద్ధి పథంలో గ్రామాలు దూసుకెళ్లాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.గురువారం నాడు ఉదయగిరి మండలంలోని గంగులవారి చెరువుపల్లి, గంగులవారి చెర్లోపల్లి పంచాయతీలలో టిడిపి గ్రామ కమిటీల ఏర్పాటు కోసం జరిగిన సమావేశాలకు కాకర్ల సురేష్ హాజరయ్యారు.ఈ కార్యక్రమాల్లో ముందుగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి నిస్వార్థంగా పనిచేసిన బూత్ ఏజెంట్లు,పార్టీ కార్యకర్తలు, గ్రామ నాయకులు, అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న నాయకులను ఎమ్మెల్యే స్వయంగా అభినందించారు.వారి సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.తదుపరి గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ముఖ్యంగా,రెవెన్యూ,సమస్యలు,భూసంబంధిత సమస్యలు,గ్రామంలో మౌలిక వసతుల లోపం,సీసీ రోడ్ల అవసరం,తాగునీటి సమస్య,విద్యుత్ సరఫరాలో అంతరాయాలు,వంటి విషయాలను గ్రామ ప్రజలు వివరించారు.వాటిని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే ఈ సమస్యల పరిష్కారానికి అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేస్తామని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు.అనంతరం టిడిపి మండల నాయకులు, గ్రామ నాయకుల సమక్షంలో ప్రతి పంచాయతీలో గ్రామ కమిటీలను సక్రమంగా ఎంపిక చేసి ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం కోసం బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం