తహశీల్దార్ హెచ్చరిక బోర్డుతో రోడ్డునపడ్డ గోపాలరావుపేట గ్రామస్తులు పురుగుల మందే శరణ్యం అంటున్న రైతులు

మన న్యూస్: భద్రాద్రికొత్తగూడెం జిల్లా,పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామ శివారు లో శనివారం నాడు రవి అస్తమిస్తున్న సమయంలో పినపాక తహశీల్దార్ అద్దంకి నరేష్ 128 వ సర్వే నెంబర్ బాపనయ్యకుంట పారకం పరిధిలోని 126.07 ఎకరాల భూమిలో పాతిన ప్రభుత్వ భూమి స్వాధీన హెచ్చరిక బోర్డుతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడ్డ సంఘటన చోటు చేసుకుంది.అకస్మాత్తుగా వచ్చి నవోదయ స్కూల్ నిర్మాణం కొరకు ఆక్రమించు కుంటున్నామంటూ బోర్డు పెట్టడంతో రోడ్డున పాలయిన రైతులు.గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో దాదాపు 100 మంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఈ భూమిని అకస్మాత్తుగా ప్రభుత్వ భూమిగా ప్రకటించి, స్కూల్ నిర్మాణం కోసం తీసుకోవడంపై గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, నవోదయ స్కూల్ పినపాక మండలానికి రావడం నిజంగా హర్షించదగిన విషయం. కానీ, రైతుల భూములు లాక్కుని స్కూల్ నిర్మిస్తామని చెప్పడం మాకు అన్యాయంగా అనిపిస్తోంది. ఖాళీ స్థలం ఎక్కడా దొరకలేదా? మా జీవనాధారమైన పొలాలను తీసుకుంటే, మా బ్రతుకులు వీధిన పడతాయి. మాకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా తయారవుతుంది, అన్నారు. రైతులు ప్రశ్నించారు, పొడు భూములకే ప్రభుత్వం పట్టాలు ఇస్తుంటే, మా పంట పొలాలకు పట్టాలు ఎందుకు ఇవ్వకూడదు? మా భూములను ప్రభుత్వ భూమిగా మార్చడాన్ని మేము ఒప్పుకోలేము. గ్రామంలో ఖాళీ స్థలంలో స్కూల్ నిర్మిస్తే మేము కూడా హర్షిస్తాం. కానీ మా పొలాలను తీసుకోవడం పూర్తిగా అన్యాయం. రైతులు వారి బాధను వివరించుతూ, ఈ భూములపై మా మూడు తరాలుగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాము . ఇప్పుడు ఈ భూములు లేకపోతే, మేము మరో చోట కొనుగోలు చేసుకునే సామర్థ్యం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి మా భూముల జోలికి రాకుండా కాపాడాలి, అని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం గ్రామ ప్రజలందరికీ ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, రైతుల ఆకాంక్షలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని, రైతుల పంట భూములకు పట్టాలు ఇచ్చి వారి జీవన విధానాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి