కాణిపాకం నవంబర్ 26 మన ద్యాస

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో వెలసిన శ్రీ స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి పంచాయతీ కి చెందిన పూతలపట్టు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొత్తపల్లి శివప్రసాద్ ఎన్నికయ్యారు శివప్రసాద్ జనసేన పార్టీ గెలుపుకోసం పార్టీ కి సేవలు అందించినందుకు అధిష్టానం తనకు ఈ పదవిని ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్,చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బాలు,పవన్, అభి, అనిల్, తెలుగుదేశం, జనసేన,బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *