బంగారుపాళ్యం, మనధ్యాస,నవంబరు 25

చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఊటీ టీ షాప్ వద్ద రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కిషోర్ కుమార్ రెడ్డి యువసేన ఏర్పాటు చేసిన భారీ కేక్ ను డాక్టర్ సునీల్ కుమార్ కిషోర్ కుమార్ రెడ్డి చేత కట్ చేసి తినిపించి అందరికీ పంచిపేట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని పదవులతో జన్మదిన వేడుకలు ఇలానే జరుపుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి హేమచంద్ర, జిల్లా ట్రేడ్ యునియన్ కార్యదర్శి రఘుపతి రాజు,నియోజకవర్గం డాక్టర్స్ విభాగం అధ్యక్షులు మనిరాజ్,మండల యువత అధ్యక్షుడు గజేంద్ర, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి మండల వాలంటీర్ల విభాగం అధ్యక్షులు సుదర్శన్, మహేంద్ర,మంజునాధ్,బాబు, రవి, యొవాన్,ప్రసాంత్, అజిత్,కిరణ్ కుమార్ రెడ్డి,మోతీష్,దేవా,సురేష్,రాబర్ట్,సోము తదితరులు దుశాలువాతో సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *