మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 24: -టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18నెలల కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు.సోమవారం మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.అధికారం చేపట్టిన తర్వాత ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో మంజూరైన ఇళ్ళలకు అట్టహాసంగా గృహ ప్రవేశాలు నిర్వహించిందని చెప్పారు.వైసిపి ప్రభుత్వం హయాంలో మంజూరైన ఇళ్ళను లబ్దిదారులు నిర్మించి ఎప్పుడో గృహ ప్రవేశాలు చేశారని చెప్పారు.అయితే ఇటీవల టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు అవే ఇళ్ళల్లో మళ్ళీ ప్రవేశాల పేరు తో సంబరాలు నిర్వహించారని ఎద్దేవా చేశారు.ఇటీవల మన్యం జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగిందని,గత సమీక్ష సమావేశం లో చర్చించిన అంశాలే ఈసారి కూడా చర్చకు వచ్చాయన్నారు.ఏడాదిన్నర కాలంలో ఈ ప్రభుత్వం కొత్త గా మంజూరు చేసిన అభివృద్ధి పనులేవీ లేవన్నారు.గత ప్రభుత్వం హయాంలో జరిగిన, మంజూరైన అభివృద్ధి పనులనే తాము చేసినట్లు టిడిపి ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు.మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గం లో వంద పడకల ఆసుపత్రి కి విద్యుత్ సరఫరా కోసం నిధుల్లేక ప్రారంభించ కుండా వదిలేశారని చెప్పారు.వైసిపి ప్రభుత్వం హయాంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ప్రత్యేక శ్రద్ధ వహించి వంద పడకల ఆసుపత్రి ని మంజూరు చేయించారని చెప్పారు.విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేయడానికి నిధులు లేక వంద పడకల ఆసుపత్రి ని వదిలేయడం విడ్డూరంగా ఉందన్నారు.ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ విషయం అద్దం పడుతోందని, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ విషయం అద్దం పడుతోందని చెప్పారు.వెనుకబడిన ఏజెన్సీ నియోజకవర్గం లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం వల్ల పేదలకు ఉచిత వైద్యం అందుతుందని మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేశారని చెప్పారు.ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రయివేటు పరం చేయడాన్ని వైసిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు.పేదలకు ఉచిత వైద్యం దూరం చేయడానికే ప్రభుత్వ వైద్య కళాశాలల ను ప్రయివేటీకరణ చేస్తున్నారని చెప్పారు.అత్యంత వెనుకబడిన మన్యం జిల్లా లో మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల ను ప్రయివేటీకరణ చేస్తుంటే జిల్లా ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారని చెప్పారు.ప్రయివేటీకరణ వద్దని ప్రశ్నించలేని దుస్థితి లో టిడిపి నాయకులు వున్నారని విమర్శించారు.ఇటీవల జిల్లాలో వున్న గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు, అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించాయని చెప్పారు.ఇంతవరకు ప్రభుత్వం ఒక్క కొత్త పింఛను గాని, కొత్త రేషన్ కార్డు గాని మంజూరు చేయలేదన్నారు‌.భర్త మరణిస్తే భార్యకి పింఛను మంజూరు చేసింది కానీ అర్హులైన వారికి కొత్తగా మంజూరు చేయలేదన్నారు.వైసిపి ప్రభుత్వం హయాంలో ఐదు సెంట్ల భూమి వున్నవారికి కూడా రైతు భరోసా మంజూరయిందని, టిడిపి పది సెంట్ల భూమి వున్నవారికి కూడా అన్నదాత సుఖీభవ కింద సాయం చేయలేదని చెప్పారు.ఇనాం భూములు న్న వారికి కూడా మంజూరు చేయలేదని చెప్పారు.వైసిపి డిమాండ్ చేసిన తర్వాత రెండో విడత లో ఇనాం భూములకు అన్నదాత సుఖీభవ కింద నగదు బదిలీ జరిగిందని చెప్పారు.సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అధికారపార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.ఆడబిడ్ఠనిధి, నిరుద్యోగ యువతకు భృతి,50ఏళ్ళకే పింఛను పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.గతంలో నవరత్నాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని, కానీ ఈకూటమి ప్రభుత్వం సంక్షోమ పథకాలకు మంగళం పాడుతూ ఇష్టానుసారంగా అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నబిన్నం చేసి ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతుందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *