మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 24:-రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు.ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందడం లేదని చెప్పారు.ప్రత్తి క్వింటాలుకు మద్దతు ధర 8000 వుంటే రైతులు 5400 రూపాయల కు అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు.మొక్కజొన్న కొనే నాధుడు లేక రైతులు నష్టానికి విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.గత ప్రభుత్వం హయాంలో పంటలకు గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు జరిగిన నష్టానికి ఇంతవరకు పరిహారం చెల్లించలేదని చెప్పారు.అన్నదాతా సుఖీభవ కింద 20 వేలు మంజూరు చేస్తామని మేనిఫెస్టో లో పెట్టిన టిడిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6వేలతో కలిసి 20వేలు మంజూరు చేస్తోందని చెప్పారు.రైతులను నిలువునా ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.ఉచిత పంటల బీమా అమలు చేయడం లేదన్నారు.ఈ సమావేశంలో వైసిపి జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ గిరిరఘు, వైస్ ఎంపిపి రెడ్డి సురేష్, వైసిపి సీనియర్ నాయకులు గొర్లి జగన్ మోహన్ రావు,కాకి పాండురంగ,పిరిడి రామకృష్ణ,పువ్వల భరత్ శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ లు ఎం.అప్పారావు,కొల్లి వెంకటరమణ పాల్గొన్నారు.