మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులు సకాలంలో పనులను పూర్తి చేయాలని ఏపీడి వామన్ రావు సూచించారు.నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ఏపీడి వామన్ రావు,ఏపీఓ శివకుమార్ లు కలిసి ముగ్గు పోసి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా వామన్ రావు మాట్లాడుతూ..లబ్ధిదారులు సకాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే,విడుదలవారీగా బిల్లులు ఆమోదించి వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయబడతాయిఅని తెలిపారు.నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనులను చేయాలని లబ్ధిదారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ శివకుమార్, పంచాయతీ కార్యదర్శి సతీష్ ,నాయకులు ప్రజాపండరి, మాజీ ఉప్ప సర్పంచ్ బొజ్జా అంజయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.