మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):
మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూర్గుల్ గేటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరా నాయబ్ తహసీల్దార్ మొహమ్మద్ ఖాలేద్, మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి కలిసి శుక్రవారం సందర్శించారు. కేంద్రంలో జరుగుతున్న ధాన్యం సేకరణ పనులను వారు ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధించిన సిబ్బందితో పరస్పరం చర్చించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం సేకరణను ప్రభుత్వం సజావుగా కొనసాగిస్తోందని తెలిపారు. రైతులు కేంద్రానికి తెచ్చిన ధాన్యం మిల్లులకు పంపిన 24 గంటల్లోపే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. తూకాల్లో పారదర్శకత, తగిన సంచులు, తాగునీరు, విశ్రాంతి సదుపాయాల ప్రభావవంతమైన ఏర్పాట్లు కేంద్రంలో ఉండేలా సూచనలు జారీ చేశారు.అధికారులతో పాటు సొసైటీ సీఈఓ రాములు, సిబ్బంది తదితరులు ఉన్నారు,







