ఉదయగిరి, ఆగస్టు 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం,తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని దుంపవారిపల్లి గ్రామంలో RO ప్లాంట్ మరోసారి చెడిపోవడంతో, గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి.ఈ సమస్యను గుర్తించిన గోదా సుందర్ రెడ్డి వెంటనే స్పందించారు. తన సొంత ఖర్చులతో అవసరమైన కొత్త ఫిల్టర్ మరియు మోటార్‌ను తెప్పించి, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించి RO ప్లాంట్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు.గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఎంతో ముఖ్యమని భావించి, ఉచితంగా తాగునీటిని అందించేందుకు ముందుకు వచ్చిన గోదా సుందర్ రెడ్డి సేవాభావానికి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు (MP) వారి సేవా స్ఫూర్తితో, కాకర్ల సురేష్ వారి సేవా స్ఫూర్తితో,మన్నేటి వెంకట రెడ్డి (మాజీ TDP రాష్ట్ర కార్యదర్శి) వారి ప్రేరణతో,ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలిచి, సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామనీ గోదా సుందర్ రెడ్డి అన్నారు.ప్రజా సేవే లక్ష్యం… ప్రజల సంక్షేమమే ధ్యేయం, ప్రజల కోసo,,ప్రజల మధ్యలో,,ప్రజలతో కలిసి ఉంటాను ఆయన అన్నారు.
