మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నఅభివృద్ధి,పథకాల పై ముమ్మర ప్రచారం చేపట్టాలని పిలుపు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ వార్ సాయిలు అన్నారు.మద్నూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మండల అధ్యక్షులు దరాస్ వార్ మాట్లాడుతూ..రానన్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరంగా వివరించాలని తెలియజేశారు.మద్నూర్ మండలానికి అత్యధిక నిధులు మంజూరు అయ్యాయని అన్నారు.ఈ అభివృద్ధిని ఇంటింటికీ తీసుకెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు.అధిష్ఠానం చెప్పినట్టు ఐకమత్యం పాటిస్తూ,సమన్వయ లోపం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.ప్రతి గ్రామం ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకులు అహర్నిశలు కృషి చేయాలన్నారు.
పార్టీ అభివృద్ధి కోసం అవసరమైతే,
గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేసి,కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని దరాస్ వార్ సాయిలు హామీ ఇచ్చారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు అభివృద్ధి పరంగా తొంభై శాతం శ్రమ పెట్టి,మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు రామ్ పటేల్,సీనుపటేల్,హన్మంత్ యాదవ్,విఠల్,హాన్మంత్ దేశాయ్,మనోహర్ దేశాయ్, కొండ గంగాధర్,హన్మాండ్లు స్వామి,రమేష్,గడ్డం లక్ష్మణ్, సంగాయప్ప,కుషాల్ , సాయిలు,రాములు, బాలు,హన్మంత్ ,గోపి,ఆముల్, సురేష్ జావిద్ పటేల్ శ్రేణులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *