మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ )రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.అనంతరం ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచనలు అందజేశారు.ప్రతి గ్రామ అధ్యక్షుడు తమ గ్రామాల్లో కాంగ్రెస్ బలం మరింతగా పెంచేందుకు చురుకైన చర్యలు చేపట్టాలన్నారు.నిజాంసాగర్ మండలంలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించే స్పష్టమైన పరిస్థితి కనిపిస్తున్నదని పేర్కొన్నారు.ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీలను అత్యవసరంగా పూర్తి చేయాలి.ఇవే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి అని స్పష్టం చేశారు.ప్రతి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తమ గ్రామాలకు వెళ్లి,గ్రామ స్థాయి మూఖ్య నాయకులకు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను,యువజన కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయాలనే ఆదేశాన్ని వెంటనే తెలియజేయాలన్నారు.
మండల కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహం నెలకొంది. గ్రామాధ్యక్షులు,యువత, మండల నాయకులంతా సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించగలమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు చాకలి సాయిలు,చిరంజీవి,శ్రీనివాస్, వీరారెడ్డి,కుర్మా సాయిలు,నాయకులు ప్రజాపండరి,అనిస్ పటేల్,తదితరులు ఉన్నారు.








