మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):ఇందిరమ్మ హౌసింగ్‌కు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో శివకృష్ణ సూచించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీడీవో శివకృష్ణ మాట్లాడుతూ…
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి అధికారులకు లేదా తాము నేరుగా తెలియజేయాలని కోరారు.ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను సకాలంలో పొందేందుకు లబ్ధిదారులు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు.ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇళ్ళ నిర్మాణాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలనీ సూచించారు.తదుపరి నలుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను ఎంపీడీవో శివకృష్ణ స్వయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తుకారం, నాయకులు లక్ష్మయ్య, అంజయ్య, గఫూర్, ప్రసాద్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.








