మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 7: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఆయిల్ టాంకర్స్ యాజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిష్కరించారని తిరుపతి జిల్లా ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగానంద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యోగానంద్ మాట్లాడుతూ…….. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానికంగా అన్ని ఆయిల్ కంపెనీల అసోసియేషన్ తో చర్చించి ఎటువంటి అవకతవకలు జరిగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారన్నారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఎన్ని ట్యాంకర్లైన ఆయిల్ ను ఇక్కడ నుండి తీసుకొని పోవచ్చని హామీ ఇవ్వడంపై తిరుపతి జిల్లా ఆయిల్ టాంకర్స్ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్ కంపెనీలకు, టాంకర్స్ అసోసియేషన్ కు అండగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉంటానని చెప్పారని పేర్కొన్నారు .ఎమ్మెల్యే చొరవతో ఆయిల్ కంపెనీలు తమకు పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పారన్నారు. ఆయిల్ టాంకర్స్ అసోసియేషన్ మద్దతుగా నిలబడిన ఎమ్మెల్యే కు ,జిల్లా అధికారులకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.










