నెల్లూరు, నవంబర్ 07 మన ధ్యాస న్యూస్ ://
: కలెక్టరేట్‌కు నిత్యం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, ప్రజల సౌకర్యార్థం లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల చెప్పారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లో నూతనంగా నిర్మించిన లిఫ్ట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లిఫ్ట్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. కలెక్టర్ ఛాంబర్ మొదటి అంతస్తులో ఉండడం వల్ల చాలామంది తనను కలిసేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. వారందరి కోసమే మంచి ఆలోచనతో ఈ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 60ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్య కారణాలతో మెట్లు ఎక్కలేక ఇబ్బందులు పడే వారికి ఈ లిఫ్ట్ ఉపయోగపడుతుందని అన్నారు.










