 
									 
శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నాయకులు అక్కల రెడ్డి నారాయణరెడ్డి,అక్కల రెడ్డి భాస్కర్ రెడ్డి
అనంతసాగరం అక్టోబర్ 31 :(మన ధ్యాస న్యూస్ )://
వైయస్సార్సీపి అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్ మొహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సహకారంతో మండల కన్వీనర్ బిజివేముల పిచ్చి రెడ్డి ప్రోత్సహంతో అనంతసాగరం మండల వైసీపీ మహిళా మండలి అధ్యక్షురాలుగా పార్లపల్లి లక్ష్మీప్రసన్న నియమించడం జరిగింది. ఈ శుభసందర్బంగా ఆమెకు వైసీపీ సీనియర్ నాయకులు అక్కలరెడ్డి నారాయణ రెడ్డిఅక్కలరెడ్డి భాస్కర్ రెడ్డి అభినందనలు తెలిజేయడం జరిగింది.ఈ సందర్బంగా వారిరువూరు మాట్లాడుతూ శంకర్ నగరం గ్రామానికి చెందిన పార్లపల్లి లక్ష్మీ ప్రసన్న వైసీపీ పార్టీని నమ్ముకొని మొదటినుండి పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రతినిత్యం పార్టీ జండాను మోసే కార్యకర్తలలో ఒకరని కార్యకర్తలను గుర్తించడంలో పైస్థాయి లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, నియోజకవర్గం స్థాయిలో మేకపాటి కుటుంభం మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకుందని కార్యకర్తల మనుగడను పెంపొందించే దిశగా నాయకుల పాలన వర్ణనాతీతం అని ఆయన కొనియాడారు.అదేవిదంగా మండల వ్యాప్తంగా పలు విభాగలలో ఎన్నికకాబడిన అందరికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు అని అక్కలరెడ్డి నారాయణ రెడ్డి,అక్కల రెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.







