వరుడిని అక్షింతలు వేసి ఆశీర్వదించిన శాసనసభ్యులు కాకర్ల..!వరుడి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి అక్టోబర్ 29 :(మన ధ్యాస న్యూస్)://

కలిగిరి మండల కేంద్రంలో ఇంగ్లే కొండయ్య – సావిత్రి దంపతుల కుమారుడు క్రాంతి కుమార్ గంధపు నలుగు కార్యక్రమం ఆహ్లాదకరంగా, ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమమునకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కాకర్ల సురేష్ స్వయంగా వరుడు క్రాంతి కుమార్‌కి అక్షింతలు వేసి, ఆశీర్వదించి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, శుభఫలితాలు కలగాలని ఆశీర్వదించారు. అలాగే ఆయన క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వకంగా ముచ్చటించి, వారి ఆతిథ్యాన్ని అభినందించారు.ఈ కార్యక్రమానికి మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై వరుడుని ఆశీర్వదించారు.